అమెరికన్‌లలో స్నేహ పూరితమైన వాతావరణంఎక్కువగా ఉండటం వలన వారు పరిచయస్తులను త్వరగా పేరుపెట్టి పిలుస్తారు. ఇంటిపేరుకి మిస్టర్, మిస్‌లాంటివి తగిలించి చనువుగా మాటకలుపుతారు. తమకంటే పెద్దవారు, లేదా అధికారంలో ఎక్కువయిన వారయితేనే డాక్టర్, సర్‌లాంటివి కలుపుతారు. అలాగే తమని కూడా పేర్లతో పిలవాలని కోరుకుంటారు. టైమ్‌కి బాగా విలు వనిస్తారు. ఎవరినైనా చెప్పిన సమయానికి కలవాలనుకుంటారు. అది అవతలివారికి ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అయితే ప్రయివేటుగా చేసుకునే పార్టీలకు, ఇళ్లలో ఏర్పాటుచేసుకున్న గెట్‌టుగెదర్‌లకు సమయం పాటించడాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఎవరి ఇంటికైతే వెళ్లాల్సిఉందో వారికి ఫోన్ చేసి టైమ్‌కి రాలేకపోతున్నామనే సమాచారం మాత్రం అందిస్తారు.
కాలేజిపిల్లలు క్లాసు రూములకు, లెక్చరర్లతో అపాయింట్‌మెంట్‌లు తీసుకున్న పుడు టైమ్‌కి తప్పనిసరిగా హాజరు కావాలి. ఎక్కువసార్లు ఆలస్యమవుతుంటే విద్యార్థుల గ్రేడ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
చాలామంది ఇన్‌స్ట్రక్టర్లు విద్యార్థుల సందేహాలను వ్యక్తిగతంగా తీర్చేందుకు అంగీకరిస్తారు. క్లాసురూములో పిల్లలు ప్రశ్నలు అడగటాన్ని ఎక్కువ ప్రోత్పహిస్తారు. గౌరవం, మర్యాద సహనం ఈ గుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గుర్తు వారి మాటల్లో ఎక్కువగా వినిపించే ప్లీజ్, థాంక్యూ అనే పదాలు. వీటిని బాగా దగ్గరవారి విషయంలోనో, పెద్దవారి విషయంలోనో కాదు...అందరి వద్దా, అన్ని ప్రదేశాల్లో ఈ పదాలను వినియోగిస్తారు. క్లాస్‌రూములు, వీధులు, షాపులు ఎక్కడ చూసినా ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మర్యాద పూర్వకంగా అడగటం వలన అవతలి వ్యక్తి స్పందనను త్వరగా పొందవచ్చని భావిస్తారు.
కనీసదూరం
ఇతరులతో కలిసి ఉన్నపుడు కనీసం 18 అంగాళాలు అంటే 43 సెంటీమీటర్లు తమ వ్యక్తిగత ప్రదేశంగా భావిస్తారు. ఆ మేరకు దూరాన్ని పాటిస్తారు. ఇది వారికి చాలా ముఖ్యం. ఈ వ్యక్తిగత పరిధి తగ్గితే వారు చాలా అసౌకర్యానికి గురవుతారు. అభినందనలు తెలుపుకునేటపుడు కూడా కౌగిలించుకోవటం చేయరు. షేక్‌హ్యాండిచ్చుకోవటం, తలలకు తాకిం చుకోవటం చేస్తారు. మా ట్లాడేటపుడు కూడా ఒకరి నొ కరు ముట్టుకోరు. అయితే చేతులు, భుజాలను కాస్త తాకటం ఆప్యాయ తగా భావిస్తారు. పరిచ యం స్నేహంగా మారాక మహిళ లు మాత్రం ఒకరినొకరు దగ్గరకు తీసుకోవటం కౌగిలిం చుకోవటం చేస్తారు.
అతిచనువుని హర్షించరు
పర్సనల్ స్పేస్ అనేది వారికి చాలా ముఖ్యం. తమ వ్యక్తిగత విషయాల్లో మితిమీరిన చనువు చూపినా, తమ వస్తువుల్ని అనుమతి లేకుండా వాడినా ఊరుకోరు. ఇల్లు, కారు, బట్టలు ఇవన్నీ సమకూర్చుకోవడానికి చాలా కష్టపడతారు. వారి వస్తువులను వాడుకోవాలంటే ముందుగా వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలి.
గెట్ టు గెదర్‌లలో...
యూనివర్శిటీ క్యాంపస్‌లో ఫార్మల్ డ్రస్‌లు తక్కువగా వాడతారు. విద్యార్థులు చాలావరకు జీన్స్, షర్టులు, స్కర్టులు, టీషర్టులు, స్వెట్‌షర్టులు, స్వెట్టర్లు ధరిస్తుంటారు. ఇంటర్వూ లకు, క్లాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగు తున్నపుడు విద్యార్థులను వారికి నచ్చిన విధంగా ఫార్మల్ దుస్తుల్లో రమ్మని చెబుతారు. ఏదైనా ఫంక్షన్‌కి హాజరుకావాల్సినపుడు ఆహ్వానించిన వారినే దుస్తుల గురించి అడిగి సలహా తీసుకుంటారు.
ఇతరుల ఆహ్వానంపై విందు వినోదాలకు వెళ్లినపుడు- కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి.
న ఆహారాన్ని చిన్న చిన్న పరిమాణంలో తీసుకోవాలి.
న సూప్‌లు. పానీయాలు తీసుకుంటున్నపుడు పెద్దగా శబ్ధం చేయరాదు.
నఅందరూ టేబిల్ వద్ద చేరుకున్న తరువాత మాత్రమే తినటం మొదలుపెట్టాలి.
న నోటిని పూర్తిగా మూసి ఉంచే నమలటం చేయాలి.
న మౌనంగా ఉండకుండా మర్యాద పూర్వకంగా సంభాషణలు చేయవచ్చు.
స్నేహంగా ఉంటారు....దగ్గరి స్నేహితులు తక్కువ
అమెరికన్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి మాటల్లో మనం చాలా సార్లు- హౌఆర్‌యు, హౌ ఈజ్‌ఇట్ గోయింగ్- అనే మాటలు వినవచ్చు. అయితే వీటిని ప్రశ్నలుగా అనుకోవాల్సిన పనిలేదు. ఈ ప్రశ్నలకు వారు సమాధానాలు కూడా ఆశించరు. ఈ మాటలను వారు పలకరింపుగా వాడతారు. అలాగే చాలా స్నేహంగా మాట్లాడినా దగ్గర స్నేహితులుగా మారరు. క్లాస్‌మెట్స్‌ని కూడా స్నేహితులుగా చెబుతారు కానీ వాటిని నిజమైన స్నేహాలుగా పరిగణించరు. వారికి నిజమైన స్నేహితులను సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది.
అనుబంధంలో స్వేచ్ఛ
అమెరికాలో డేటింగ్ అనేమాట తరచుగా వినబడుతుంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది. అనుకున్న సమయంలో, అనుకున్న ప్రదేశంలో కలుసుకుని కొంత సమయం గడపడాన్ని డేటింగ్ అంటారు. డేటింగ్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు. డేటింగ్‌కి వెళ్లినపుడు సాధారణంగా అబ్బాయే రెస్టారెంట్ బిల్లులవంటివి చెల్లిస్తాడు. విద్యార్థులు 'గో డచ్' అనే పేరుతో కలుస్తుంటారు. ఇలాంటపుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఇరువురూ ఖర్చుపెడుతుంటారు.
అమెరికా సంస్కృతిలో డేటింగ్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలేజి వయసు నుండి అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మామూలు స్నేహం నుండి, భావోద్వేగపరంగా ఒకరిపై ఒకరు ఆధారపడే స్థాయి వరకు రకరకాల స్నేహాలుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ అయిష్టంగా ఒక అనుబంధంలో ఉండటానికి ఒప్పుకోరు. తమ మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఇబ్బంది పడరు. సహజంగా ఉండే స్నేహతత్వాన్ని వ్యక్తిగత ఇష్టంగా అనుకుంటేనే సమస్యలు ఎదురవుతాయి. డేటింగ్‌లో ఆల్కహాల్ తీసుకోవటం చాలాసార్లు సమస్యగా మారుతుంది. హోమో సెక్పువాలిటి, గే, లెస్బియన్, బై సెక్సువల్...ఇలాంటివాటిని మరీ సీరియస్‌గా తీసుకోరు. ఇదివరకటి కంటే ఇప్పటితరం లైంగిక ఇష్టాయిష్టాలను పూర్తిగా వ్యక్తిగతమైనవిగా భావిస్తున్నారు. అయితే వీటిని అంగీకరించనివారు కూడా ఉంటారు.
మతం చర్చలు నచ్చవు
ఇక్కడ రకరకాల సంస్కృతులవాళ్లు కలిసిమెలసి జీవిస్తుంటారు. ఎవరైనా తమ ఆచారాలు సంప్రదాయాలను స్వతంత్రంగా పాటించవచ్చు. వివిధ మతాలకు చెందినవారు గ్రూపులుగా ఏర్పడటం కనిపిస్తుంది. ఇక్కడ చర్చికి వెళ్లేవారు ఇతర దేశాలతో పోల్చినపుడు చాలా ఎక్కువ సంఖ్యలో కనబడతారు కానీ, మతం గురించి మాట్లాడటం మాత్రం వారికి అంతగా నచ్చదు. చాలామంది నిజాయితీగా, ముక్కుసూటిగా ఉంటారు. అయితే కొంతమంది ఇతరులను తమ మతంలోకి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.
నిషేధం...మీరితే చర్యలు
ఆల్కహాల్, స్మోకింగ్ విషయంలో ప్రభుత్వ చట్టాలున్నాయి. 21 సంవత్సరాలలోపువారు వీటిని కొన్నా, కొనడానికి ప్రయత్నించినా, తీసుకున్నా, వీటికి సంబంధించిన ఫ్యాక్టరీలలో పనిచేసినా చట్టరీత్యా నేరం. 21 సంవత్సరాలు లో పు వయసున్నవారికి వీటిని అమ్మటం కానీ, బార్‌ల్లో ఇవ్వటం గానీ చేయరు. విద్యార్థులు ఆల్కహాల్ కొనాలనుకుంటే ఫొటోతో కూడిన ఏమైనా రెండు గుర్తింపు కార్డులు చూపించాలి. ఈ విషయంలో తప్పుడు గుర్తింపు కార్డులు చూపినా మరో విధంగా ఆల్కహాల్‌కోసం ప్రయత్నించినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
నాన్‌రెసిడెన్షియల్ ప్రదేశాల్లో, యూనివర్శిటీల్లో, స్మోకింగ్ నిషేధం. అయితే రెస్ట్ రూములు, లంచ్‌బ్రేక్ రూములు, ప్రయివేటు ఆఫీసులు, వర్క్‌స్టేషన్లు, వెయిటింగ్ రూములు, కాన్ఫరెన్స్ రూములకు మినహాయింపు ఉంది
ఆంద్రప్రభ నుంచి సేకరణ