దర్శక నిర్మాత మహేష్ భట్ రెండవ కుమార్తె అలియా భట్ హీరోయిన్‌గా బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా ఈమెతో బాటు నటుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్, సిద్దార్థ మల్హోత్రా కూడా పరిచయం అవుతున్నారు. షారుఖ్ ఖాన్‌తో కలసి కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల అవుతోంది.
సంఘర్షణ చిత్రంలో బాలనటిగా 1999లో. ప్రీతిజింటా చిన్న పిల్లగా ఉన్నప్పటి ప్రీతి ఒబెరాయ్ పాత్ర పోషించింది అలియా. కరణ్ జోహార్ చిత్రంలో అలియా హీరోయిన్ అయినందుకు ఆనందంగా వుందని ప్రీతి జింటా పేర్కొంది.
అలియా గురించి కరణ్ జోహార్ చెబుతూ ''స్కూల్ యూనిఫాంలో తన 17వ ఏట నన్ను కలిసింది అలియా భట్. వయసుకు మించిన బరువు కూడా వుంది. అలియా నా చిత్రానికి పనికిరాదని అనుకున్నాను. ఆ తర్వాత 500మంది ఆడిషన్ టెస్ట్‌లో పాల్గొనగా స్వెట్టర్ ధరించి ఆడిషన్లో పాల్గొన్న అలియానే ఎంపిక చేసాం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో హీరోయిన్‌గా'' అన్నారు.
''నిజానికి మా నాన్నే పెద్ద దర్శక, నిర్మాత. ఆయన రూపొందించే చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం కావడం సులభమే. కానీ నాకు ఆసక్తి లేదు. ఈ చిత్రంలో నటించడం ద్వారా ఎలా నటించాలో కరణ్ వద్ద నేర్చుకున్నాను. అంతేకాదు మా నాన్న రూపొందించే చిత్రాలకు సహాయకురాలిగా కూడా పనిచేసాను'' అంది ఆలియా భట్.
ధర్మా ప్రొడక్షన్స్ పతాకాన రూపొందిన 'స్టూడెంట్ ఆప్ ది ఇయర్' చిత్రంలో హైస్కూల్ డ్రామాతోబాటు, లవ్, రొమాన్స్ అంశాలు కూడా సమ్మిశ్రమయ్యాయి.