ఈ రోజు (ఏప్రిల్ 16) ప్రపంచ విఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ జన్మదినం. ప్రపంచాన్ని నవ్వుల్లో ముంచెత్తిన చాప్లిన్ గురించి తెలియనివారెవరూ ఉండరు. చాప్లిన్ తల్లి స్టేజ్ కళాకారిణి. తండ్రి మద్యం మత్తులో నిత్యం మునిగి తేలేవాడు. వామపక్ష భావాలు కలిగిన చాప్లిన్‌పై అమెరికా నిషేధం విధించింది. చార్లీ చాప్లిన్ అసలు పేరు ట్రంప్. చార్లిన్ చెప్పిన జీవిత సత్యాలివే...
ఎవరి నిజమైన చరిత్ర అయినా వారు మత్తులో ఉన్నప్పుడే తెలుస్తుంది.
నవ్వు అనేది లేకుండా గడిపే ప్రతీరోజూ వ్యర్థమే!
ఈ ప్రపంచం చాలా కౄరమైనది. దీనితోపాటు నడిచేందుకు కౄరునిగా మారాల్సి వస్తుంది.
మనల్ని వంటరిగా వదిలేస్తే జీవితం ఆనందమయం అవుతుంది.
అంత్యకాలంలో ప్రతీదీ అబద్ధమే అనిపిస్తుంది.
నాకు భగవంతునితో ఏ సమస్యాలేదు... అంతా నా విరోధులతోనే!
నా విషయంలో సుఖం, సౌకర్యాలు అలవాట్లుగా మారిపోవడమే బాధాకరం.
మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం... తక్కువగా అనుభూతి చెందుతాం.