నేడు హైదరాబాద్ మహా నగరంలో ఎయిడ్స్, హెచ్‌ఐవి వ్యాధులపై జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. మూడురోజుల పాటు జరుగు ఈ సదస్సును ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు దేశం నుంచే కాక విదేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వైద్యులు, హెచ్‌ఐవిపై పరిశోధన చేసిన దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు ఆధ్వర్యాన జరిగే ఈ సదస్సులో ఆ సంస్థ డెరైక్టర్ అర్. వి. చంద్ర వదన్ తో పాటు ఎయిడ్స్ సోసైటి ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ఐ.ఎస్. గిలడాపాల్గొన్నారు.