29, అక్టోబర్ 2010, శుక్రవారం

'కోదండరాం... ప్రొఫెసర్‌వా... పోరంబోకువా ?

'2011 లో రావాల్సిన పదోన్నతిని అధికారులను బెదిరించి ముందుగానే పొందావన్న ఆరోపణలు నీపై ఉస్మానియా వర్సిటీలో గుప్పుమంటున్నాయి. వీటిపై ఎందుకు స్పందించడంలేదు. పైగా చంద్రబాబునే ప్రశ్నిస్తావా ?' అంటూ ప్రొఫెసర్ కోదండరాంపై తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) మండిపడింది. సెప్టెంబర్ 17 న విలీనమా ? విమోచనమా ? అన్న అంశంపై రాజకీయ జేఏసీలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు భిన్నవాదనలను వినిపించినా, జేఏసీ కన్వీనర్‌గా కోదండరాం ఇంతవరకు సరైన వివరణనివ్వలేకపోయాడంటూ కోదండరాంను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు.

తెలంగాణా అమరవీరుల కుటుంబాలపై దాడులు జరుగుతున్నా ఖండించలేని అసమర్ధ కన్వీనర్ అని ధ్వజమెత్తారు. ఆంధ్రా పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ రహస్య సమావేశం పెట్టినా స్పందించలేదని దుయ్యబట్టారు. కోదండరాం ఒక పొలిటికల్ జోకర్, టీఆర్ఎస్ బ్రోకర్ అని దుయ్యబట్టారు. 'కోదండరాం... నువ్వు ప్రొఫెసర్‌వా... పోరంబోకువా ?' అని ధ్వజమెత్తారు.



ఆంద్ర జ్యోతి సహకారంతో