ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పెద్దపల్లి రైల్వేలైన్ పనులకు మోక్షం లభించింది. జగిత్యాల వరకు ఈ పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో రైల్వేలైన్‌కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించకపోవటంతో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు జగిత్యాలనుంచి మోర్తాడ్ వరకు రైల్వేలైన్ పనులకోసం 140 కోట్లు మంజూరుకావటంతో అధికారుల్లో కదలిక వచ్చింది.
ప్రారంభమైన పనులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించారు. 2011 మార్చి కల్లా జగిత్యాలనుంచి మోర్తాడ్‌వరకు రైల్వేలైన్ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పరిపాలనాధికారి సుకుష్‌కుమార్ శర్మ తెలిపారు.
ప్రజాశక్తి సౌజన్యం తో