తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది భీమ్ విగ్రహాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాంస్కృతిక శాఖ పని ప్రారంభించింది. మొత్తం 30 లక్షల రూపాయల వ్యయంతో కొమురంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహస్థాపనకు స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర పర్యాటకశాఖ హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది