28, అక్టోబర్ 2010, గురువారం

తెలుగు లలిత కళా తోరణంకి రాజీవ్ పేరు పెట్టడం తప్పేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


తెలుగు లలిత కళా తోరణంని రాజీవ్ గాంధీ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతుండటం విశేషం. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ని దర్శించు కున్న కుత్బుల్లాఫూర్, మల్కాజిగిరి, శాసన సభ్యులు శ్రీశైలంగౌడ్, ఆకుల రాజేందర్‌లు విలేకరులతో మాట్లాడుతూ ... పలు ప్రాంతాల నుండి వస్తున్నా నిరసనలు... తెలుగు భాషకి సంభందం లేని రాజీవ్ గాంధీ పేరు పెడితేనే డబ్బులిస్తా అని ఓ ఎంపి చెప్పినంత మాత్రాన జిఒ విడుదల చేయటం.. సరికాదని అన్నారు. అధిక శాతం తెలుగు ప్రజలు తెలుగు లలిత కళా తోరణం పేరు మార్పు కోరుకోవటం లేదని... స్పష్టమవుతుందని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు . .

హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందవలసి ఉందని, ఆమోదం పొందిన తర్వాతనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుం దన్నారు. పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు తమ స్వేచ్ఛ కొలది మాట్లాడుతున్నారు. ఏ అంశంపైనైనా అధిష్ఠానందే తుది నిర్ణయమని వారు స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే డిసెంబర్ 31న ప్రత్యేక తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికను తాము స్వాగతిస్తామన్నారు.. రాష్ట్ర విభజనపై తమ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు.