ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్/ పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రవేశాలకు వచ్చే నెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు..
ఫుల్‌టైమ్ పిీహెచ్‌డీ ప్రవేశాలకు రాత పరీక్ష తప్పనిసరనే యూజీసీ నిబంధనలను అమల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఫుల్‌టైం ఎంఫిల్, పిీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు వీలైనంత త్వరగా హాల్‌టిక్కెట్లు పంపిణీ చేయాలని ఉపకులపతి ఆదేశించారు.
ఒకే రోజు సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు రాత పరీక్ష నిర్వహించి, తరువాత మౌఖిక పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు.