రాష్ట్రం, దేశంలో విభజన ఉద్యమాలు సాగుతున్నాయని, దీనిని సీపీఎం వ్యతి రేకిస్తోందని, దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేర్కొన్నా రు.
సాధారణ ప్రజలకు విద్యావ్యవస్థ షాపింగ్‌మాల్‌లా తయారైందని,.. కేంద్రం మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశ పెట్టే పథకాలు ఆందోళన కలిగిస్తున్నా యని, ప్రైమరీ విద్య కూడా ప్రై వేటీకరణ అయిపోయిందన్నారు. ఎస్ ఎఫ్ఐ విద్యావిధానం, అ«ధ్యయనం, పోరాటం అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.