15, నవంబర్ 2010, సోమవారం

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య డిమాండ్ చేసారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ అంశంపై నాటకాలు చేస్తున్నాయని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఒక వేళ తెలంగాణ ఇవ్వకుంటే నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాం ధ్ర ప్రదేశ్‌గా మారుస్తుందని, టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని, టీడీపీ హయాంలో మద్యపాన నిషేధంపై ఎక్కువగా మాట్లాడిన రోశయ్య ప్రస్తుతం మద్యం అమ్మకాలపై దృష్టి సారించడం దారుణమని ప్రొహిబిషన్ అన్నమాటకు అర్థం ఏంటో ప్రభుత్వమే చెప్పాలని ఆమె అన్నారు.

సామ్రాజ్యవాద విష సంస్కృతి విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ సినిమాలు, పబ్‌లు, బార్లు తెరువడంవల్ల యువతపై ప్రభా వం పడనుందన్నారు.