15, నవంబర్ 2010, సోమవారం

తెలంగాణావాదినంటూనే సమైక్యవాదిగా ....

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణావాదినంటూనే సమైక్యవాదిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత చకిలం అనిల్‌కుమార్ ఆ రోపించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అడుగడుగునా తెలంగాణాకు ద్రోహం చేశారని, ఆయన శిష్యుడిగా వ్యవహరిస్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి...వైఎస్ మరణానంతరం మంత్రి పదవి ఎక్కడ ఊడుతుందోన ని తెలంగాణ నినాదాన్ని పక్కనబెట్టి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పంచన చేరారని ఆరోపించారు.

డిసెంబర్ 31 తర్వాత తెలంగాణకు జైకొట్టకపోతే మంత్రిని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.