కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాధమిక సభ్యత్వాన్ని తొలగించడంపై ఆగ్రహించిన కొండా సురేఖ మరోసారి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
పిసిసి అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోని పిసిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమీ తప్పు చేయకున్నా ఆయన సభ్యత్వాన్ని ఎలా తీసివేస్తారని ... దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉండడమే చెవిరెడ్డి చేసిన తప్పిదమా అని ప్రశ్నించారు
పిసిసి కి ప్రభుత్వానికి ఏమాత్రం సయోధ్యలేదని, ఉంటే గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులే వినతి పత్రం సమర్పిస్తే వారిని పిలిపించి విచారించిన దాఖలాలు లేవని, పిసిసి కానీ, ప్రభుత్వం కానీ వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్దం కావడంలేదన్నారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక కమిటీని నియమించి వాస్తవాలు తెలుసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ పై ద్రుష్టి పెట్టాలని తన లేఖలో సురేఖ కోరారు.