15, నవంబర్ 2010, సోమవారం

జై రోశయ్య అంటూ.. రూటు మార్చిన కొణతాల...

విశాఖలో ఈ నెల 17న జరిగే ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్‌కే మద్దతు తెలుపుతున్నట్టు ఇప్పటి వరకు కనిపిస్తూ వస్తున్న కొణతాల ఇప్పుడు బాణీ ఎందుకు మార్చారు? ఎంపీ సబ్బం హరికి జగన్ అధికంగా ప్రాధాన్యం ఇస్తుండడం వల్లనే కొణతాల రూట్ మార్చారా? లేక మరేదైనా కారణం వున్నదా? అన్న విషయాలపై చర్చ జరుగుతున్నది.