బెంగుళూరు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 13న జరుగనున్న శ్రీకృష్ణ దేవరాయల పంచ శత పట్టాభిషేక మహోత్సవం, కర్ణాటకాంధ్ర రాష్ట్ర అవతరణ మహోత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు
కర్ణాటకాంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలను కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య కడప రమణయ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రత్యేక అతిథులుగా మాజీ గవర్నర్ డా.వి.ఎస్.రమాదేవి, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, ప్రముఖ కన్నడ సాహిత్య వేత్త చంద్రశేఖర కంబార ముఖ్య అతిథిగా హాజరవుతారు.
చౌడయ్య స్మారక భవనంలో 13న ఉదయం 10 గంటలనుంచి జరిగే ఈ ఉత్సవాలలో శ్రీకృష్ణ దేవరాయ పురస్కారాన్ని ప్రముఖ కన్నడ సాహితీవేత్త చం ద్రశేఖర్ కంబారకు, జాతీయ చలన చిత్ర ఉత్తమ నటి పురస్కార గ్రహీత ఉమాశ్రీ, ప్రసిద్ధ కవి, పలగాని గోపాల్ రెడ్డిలకు ప్రదానం చేసి ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ కన్నడ గాయకుడు శశిధర్ కోటె బృందంచే సంగీత సంభ్రమ కార్యక్రమ0... సవితా అరుణ్ ఆధ్వర్యంలో కర్ణాటక వైభవం కన్నడ నృత్య రూపకం ప్రదర్శిస్తారు ప్రఖ్యాత గాయకుడు చంద్రతేజ బృందంచే ఘంటసాల గానలహరి, మిర్యాలగూడకు చెందిన సాంస్కృతిక కళాకేంద్రంచే కృష్ణపక్షం (శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరసుల కథ) చారిత్రక పద్యనాటక ప్రదర్శన ఉంటుంది.