తెలంగాణ నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మీ ఆర్ట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చలన చిత్రం జై బోలో తెలంగాణ షూటింగ్ వరంగల్‌లో ప్రారంభించనున్నట్టు దర్శకుడు శంకర్ తెలిపారు. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి, నగరంలోని షూటింగ్‌కు అనుకూలంగా ఉన్న పలు ప్రాంతాలను , కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి చిత్ర నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్టు..రియాలిటీ కోసం పలువురు తెలంగాణ యోధులు, మేథావులను కూడ చిత్రంలో భాగస్వాములను చేసినట్టు ఆయన చెప్పారు