అయ్యప్ప మాల వేసుకునే భక్తులకు ఆదివారం నుంచి జనవరి 5వ తేది వరకు అరవై రోజుల పాటు 'చేయూత' ట్రస్ట్ ఆధ్వర్యంలో సమారాధన కార్యక్రమాన్ని విజయవాడ పటమటలంక అవధూత ఆశ్రమం ప్రాంగణంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు మురళీకృష్ట (కెం.ఎం.కే ఈవెంట్స్), వైస్ ఛైర్మన్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ (శ్రీ చైతన్య) తెలిపారు.
గత నాలుగేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అరవై రోజుల పాటు జరిగే ఈ అన్నసమారాధనలో ప్రతి ఏటా దాదాపు లక్ష మంది దీక్షా పరులు సద్ది చేస్తుంటారని తెలిపారు. అయ్యప్ప దీక్షా పరులే కాకుండా భవానీమాల, శివ మాల, గోవింద మాల వేసే భక్తులు, ప్రాంగణానికి వచ్చి అన్న సమారాధన చేయవచ్చని తెలిపారు.