20 రోజుల పాటు నిర్వహించిన నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర జగన్‌కు చేదు ఫలితాలు మిగిల్చింది. ఆయన జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే జగన్ వర్గీయులై న నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై నాయకత్వం వేటు వేసింది.
మరికొద్ది రోజుల తర్వాత జగన్‌కు మద్దతుగా నిలిచిన యువజన కాంగ్రెస్ అధ్యక్షులను పదవులు నుంచి తొలగించిం ది. టాలెంట్ హంట్ పేరుతో అధిష్ఠానం జగన్ వర్గాన్ని దాదాపు వెంటాడినంత పనిచేసింది. మీరు జగన్ వర్గమా ?అని నేరుగా ప్రశ్నించే పరిస్థితికి రావడంతో జగన్‌తో ఉంటే పదవులు రావన్న భయాందోళన సృష్టించడంలో విజయం సాధించింది.
చివరకు.. వైఎస్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మంత్రి ఆనం వర్గం ఒక్కసారిగా విధేయత మర్చి, జగన్‌కు దూరమయింది. ఈ ప్రకారంగా జగన్‌కు నెల్లూరు జిల్లా పర్యటన కలసి రాలేదనే చెప్పాలి.
జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం విస్పష్టంగా ఆదేశించడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. ఒకవైపు భారీ వర్షాలతో జనం సమస్యల్లో చిక్కుకోకుండా, జగన్ వారిని పరామర్శించకుండా సొంత ఇమేజ్ పెంచుకుంటున్నారన్న భావన కూడా వ్యక్తమయింది. జగన్‌కు చెందిన సొంత మీడియా సంస్థలు తప్ప, మిగిలిన మీడియా సంస్థలేవీ యాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వక పోవటం . ... ఒద్దర్పు ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలోనే.. జగన్ వర్గం అటు సినీ నటి రొజాని... ఇటు లక్ష్మి పార్వతిని రంగంలోకి దించినా... వారి ప్రసంగాలలో జగన్కి జై కొట్టడం తప్ప.. విమర్శలు చేస్తున్న విపక్షలని పల్లెత్తు మాటనక పోవటంతో.. జగనే అధినేత్రి పై యుద్ధం ప్ర క టించి నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల భావన