రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇసుక అక్రమాలపై కొత్త భాష్యం చెప్పారు. 'గ్రామాల్లో దబాయించేవారు, మోతుబర్లు, రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారు..ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలి లేదా ప్రజలైనా వినియోగించు కోవాలి. కానీ దళారులు దోచుకుని లాభపడుతున్నారు. ఇక నుంచీ వాహనాలను సీజ్ చేయడం కాదు..డబ్బులు వసూలు చేసేవారినే బొక్కలోపెట్టండి'..అంటూ బొత్స రివర్స్‌గేర్‌కు అధికారులే ఖంగుతిన్నట్టయింది.
తెలుగుదేశం వారు కాంగ్రెస్‌పైనా, కాంగ్రెస్ వారు టిడిపిపైనా విమర్శించుకోవడం కనిపిస్తోందని అన్నారు. డబ్బులు వసూలుకు పాల్పడేవారిని లోపల వేస్తే ఏ పార్టీయో తేలుతుందని వ్యాఖ్యలు చేస్తుండటం ...ఇప్పటివరకూ ఆయా మండలాల్లో తహశీల్దార్‌లు, ఎస్‌ఐలు ట్రాక్టర్లను సీజ్ చేయడం, డబ్బులు తీసుకుని వదిలేయడంతో వారు బాగా గడించారన్నది బొత్స అంతరంగం.
తాజాగా వాహనాలపై సీజ్ చేయొద్దంటూ ఆదేశించడం వెనుక అధికార పార్టీ నాయకులకు ఆ డబ్బులు చెందేలా చేయడం ఒకటైతే, వాహనాల సీజ్ సమస్య కూడా భవిష్యత్‌లో ఉండకుండా బొత్స జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.