కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధిస్తే కలిదోషాలు దూరమై జన్మరాహిత్యం కలుగుతుందని పరమహంస పరివ్రాజకులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు.
తిరునక్షత్ర మహోత్సవాల్లో సోమవారం ఆయన అనుగ్రహభాషణం చేస్తూ ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో అర్చనాదికాలు చేస్తే భగవంతుని అనుగ్రహం సంపాదించటం సాధ్యమేనన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసాలతో స్వామి కృపకు అర్హత సాధించాలన్నారు. విగ్రహారాధన వల్ల ఏకాగ్రత కలుగుతుందని, సుందర స్వరూపుడైన పరమాత్మ రూపాన్ని మనోఫలకంపై నిలిపి ధ్యానం చేయాలన్నారు. అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతామని తెలిపారు.