మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం ఆమోదించారు.
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చవాన్ తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి సమర్పించిన విషయం తెలిసిందే.
రాజీనామ లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపాలని ఏఐసీసీ అశోక్‌చవాన్‌కు ఆదేశించింది.