తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కుమ్మక్కై జనంతో ఆటలాడుకుం టున్నారని తెరాస శాసనసభ్యుడు కె. తారక రామారావు ఆరోపించారు.
శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. తాము చేసున్న ఆరోపణ లు నిజం కాదని నిరూపించాలనుకుంటే... తమ పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఊరూరు తిరుగుతున్న చంద్రబాబు తానే అవిశ్వాసానికి ఎందుకు సిద్దపడటంలేదో.. ప్రజలకు జవాబివ్వాలని... లేక దమ్ముంటే.. తమ పార్టీ ప్రవేశ పెట్టే తీర్మానానికి మద్దతు ఇచ్చి తెలంగాణాపై తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు కెటిఆర్.