సుదీర్ఘకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తిరుమల వెంకన్న ఆశీస్సులు లభించాయి. టీటీడీ చైర్మన్‌గా రాయపాటి నియామకాన్ని 10 జన్‌పథ్‌కు నివేదించటంతో మార్గం సుగమమైనట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.
అంతకుముందు ఆయన బోర్డు సభ్యుడిగా పనిచే సిన రాయపాటి 2004లో మంత్రి పదవి ఆశించి భంగపడి, టీటీడీ చైర్మన్ పదవి ఆశించారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేయాలన్నది తన చిరకాల వాంఛ అని అనేకమార్లు ముఖ్యుల వద్ద ప్రస్తావించిన ఆయన ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. ఉగాది రోజున బోర్డును ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.