7, ఏప్రిల్ 2011, గురువారం

ఖాకీల చేతిలో ప్రశాంత నిలయం బందీ

ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి ప్రస్తుతం ఖాకీ వలయంలో చిక్కుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా పుట్టపర్తిలో భారీగా పోలీసులను మోహరించారు. ఎటుచూసినా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలను అనుమతించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా సోదాలు చేస్తున్నారు. దీంతో ప్రేమను పంచే ప్రశాంతి నిలయానికి పోలీసుల సంకెళ్లేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ప్రస్తుతం పుట్టపర్తిలో ప ది మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది దాకా ఎస్‌ఐలు, సుమారు 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో? పోలీసులు అతిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో? దీన్ని ప్రభుత్వం ఎం దుకు ప్రోత్సహిస్తోందో? అంతుచిక్కడం లేదని భక్తులు వాపోతున్నారు.