ప్రపంచకప్ విజయంతో కోట్లాది మంది భారతీయుల్లో ఉల్లాసం, ఉత్సాహం తొణికిసలాడుతోందని బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తెలిపారు. దేశప్రజలందరినీ ఏకతాటిపైకి తేవటంలో క్రికెట్‌ను, సినిమాను మించింది మరొకటి లేదని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కోట్లాది ప్రజలను రంజింపజేశారు..కానీ వారం రోజుల్లోపే వారి ప్రవర్తనలో రానున్న విచిత్ర మార్పు తనకెందుకో విపరీత, వికార బుద్ధిలా అనిపిస్తోందని అసంతృప్తి వెలిబుచ్చారు.
దీనికంతటికీ అసలు కారణం శుక్రవారం ప్రారంభంకానున్న ఐపీఎల్ నాలుగో సీజన్ టోర్నమెంట్‌లో భారత క్రికెటర్లందరూ ఒకే జట్టుకు ఆడకుండా వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ పోరాడుకోవటం అమితాబ్‌కు అస్సలు నచ్చలేదు. అందుకే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు