ఇచ్చిన హామీలను విస్మరించి, విద్యుత్ చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పి.అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. 2014 వరకు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచిపోయిందని దుయ్యబట్టారు. సేవాపరమైన సమస్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం చార్జీల పెంపుతో మరింత ఇక్కట్లపాలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో వర్షాభావ పరిస్థితుల్లోనూ సక్రమంగా విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తెరగాలని అశోక్ చెప్పారు.