పనిపై ఆసక్తి, అలుపెరుగని శ్రమే సూపర్‌స్టార్ రజనీకాం త్ విజయ రహస్యమని దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్ పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చాలా మంది దర్శకులు, నటులు ఐదారు చిత్రాలతోనే తెరమరుగవుతున్నారన్నారు.
అందుకు కారణం స్క్రిప్ట్‌లపై పూర్తిగా దృష్టి సారించకపోవడమేనని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏవీఎం.మెయ్యప్పన్ లాంటి నిర్మాతలు పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైతేనే సెట్‌పైకి వెళ్లేవారన్నారు. రజనీకాంత్ నేటికి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారం టే అందుకు ఆయన పడే శ్రమ, పనిపై ఆసక్తే కారణమని ముత్తురామన్ వ్యాఖ్యానించారు.