అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షకు ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ తన మద్దతును ప్రకటించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి వెంటనే జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చొరవ తీసుకోవాలన్నారు.