ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నుంచి దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని అన్నా ప్రారంభించిన దీక్షకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యోగా గురువు బాబా రాందేవ్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ, జనతాదళ్(యునెటైడ్) నాయకుడు శరద్ యాదవ్ తదితర ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు.