6, ఏప్రిల్ 2011, బుధవారం
పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే
హిందీ భాషా వ్యతిరేకినని చెప్పుకునే కరుణానిధి ఏ మొహం పెట్టుకుని ఉత్తరాదికి చెందిన ఖుష్బూను ఎన్నికల ప్రచారానికి పిలిచారని ప్రముఖ హాస్యనటుడు సెంథిల్‌ప్రశ్నించారు. కరుణానిధి కలర్ టీవీలను ఉచితంగా ఇచ్చి, కేబుల్ కనెక్షన్‌ల ద్వారా ఏడాదికి రూ. 500 కోట్లను తన ఇంటికి తరలిస్తున్నారని ఆరోపించారు. పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు. పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే కపట రాజకీయాలు ఆడే పార్టీలన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయని, వాటిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఓటర్లకు పిలుపునిచ్చారు.