తమిళ నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రధాన పార్టీలైనా డీఎంకే, అన్నాడీఎంకే నేతలను ఊహా లోకాల్లో విహరించేలా చేస్తున్నాయి. కొన్ని సర్వేలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఉంటే మరికొన్ని అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని వచ్చాయి. వీటి ఆధారంగా గెలుపు తమదంటే తమదేనంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు ఇలా ఉండడం వల్ల ఎవరు అధికారంలోకి వస్తారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. హంగ్ వచ్చే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.