కార్గిల్ యుద్ధవీరుల కుటుం బాల కోసం నిర్మించిన ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్లను అనర్హులు దక్కించుకున్న నేపథ్యంలో వెలుగు చూసిన కుంభకోణం సెగలు రాజకీయ నాయకులను ఇంకా వీడడంలేదు. ఇప్పటికే ఈ కుంభకోణంతో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అశోక్‌రావ్ చవాన్‌లకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణం కేసును దర్యాప్తు జరుపుతున్న విచారణ మండలి వీరిరువురికి సమన్లు జారీ చేసింది. విచారణ మండలి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ మాజీ ముఖ్యమంత్రులిద్దరికీ విచారణ మండలి ముందు హాజరుకావడం అనివార్యంగా మారింది.