భారతావని కళలకు పుట్టినిల్లు.. శిల్పకళకు జీవగడ్డ. ఎందరో చక్రవర్తు లు, మహారాజులు, రాజులు, సరాజులు, సామంతులు తమ అభిరుచుల మేరకు కట్టించిన ఎన్నో కట్టడాలకు శిల్పకళా నైపుణ్యం తోడై నేటికి పర్యా టక కేంద్రాలుగా భాసిల్లుతునే ఉన్నాయి. ఆంధ్రదేశాన సైతం ఇలాంటి కళాసంపద అందర్నీ ఆకర్షిస్తూ ... అక్కున చేర్చుకుంటున్నాయి. వాటిలో అగ్ర భాగాన నిలచేది లేపాక్షి అనటంలో సందేహం లేదెవ్వరికీ... అద్భుత శిల్ప కళా నిలయంగా నిలచే లేపాక్షి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేవెూ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్య అంటూ అడవి బాపిరాజులాంటి అగ్ర కవి ఉత్తములే ఇక్కడి నందిని చూసి పరవశించి పోయారంటే చూసేవారికి కళా తృష్ణ ఉండాలే కానీ ఇక్కడి శిల్ప కళాఅందాలెలాంటివో ఇట్టే తెలుసుకోవచ్చు.
విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ్ప్పశ 1530 నుండి 1542 వరకు పాలించిన అచ్యుత దేవ రాయులు కాలంలో ఇక్కడ వీరభద్ర ఆలయాన్ని నిర్మించడం జరిగిందని...ఏక శిలపై తెలుగుదనం ఉట్టి పడేలా నంది నిర్మాణం జరిగి నట్లు చరిత్రకారులు చెప్తారు. పెనుగొండగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం లో ఆంధ్రదేశాన హిందుపురానికి 18 కిలో మీటర్ల దూరంలో వెలసిన అద్భుత శిల్పకళా క్షేత్రం లేపాక్షి. రాయల కాలం అంతరించాక ఈ ప్రాం తాన్ని అనేక మంది ఆక్రమించుకున్నారు. ఆపై నవాబులపాలనలోకి వచ్చి తరువాత పాలెగాళ్లు...ఆపై మరాఠాల ఏలుబడిలో కొనసాగింది. మురారి రావు అనే మరాఠాయోధుడు తన తండ్రి హిందూరావు పేరుపై నిర్మించిన పట్టణం హిందూపురం. తరువాత టిపð సుల్తాన్ పాలనలోకి వెళ్లిన ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ పాలకులు టిపð సుల్తాన్‌ని శ్రీరంగ పట్టణంలో వధించి తమ వశం చేసుకుని నైజాం పాలనలోకి తెచ్చారు. తదుపరి నైజాం తన రాజ్యంలోని కొంత భాగాన్ని బ్రిటీష్ వారికి దత్తత ఇవ్వటంతో ఈ ప్రాంతం కూడా ఆ దత్తమండలంలో భాగమై బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనేక దాడుల కారణంగా ఇక్కడి శిల్పకళా సంపద కొంత మేర నష్టం జరిగిందని చెపుతారు.
లేపాక్షికి ఆపేరెలా వచ్చిందంటే...
సీతాదేవిని చెరబట్టిన రావణుడు ఆమెని లంకకి తీసుకెళ్లే క్రమంలో తన వాయువాహనంపై ఈ ప్రాంతం నుండి వెళ్తుండగా... అడ్డగించి దాడి చేసి... సీతను కాపాడేందుకు ప్రయత్నించిన జఠాయువు రెక్కల్ని కత్తిం చగా. ఆపై రాముడు ఆ పక్షిని లే.. పక్షి అని తట్టి లేపగనే లేచి కూర్చొం దని.. ఆపై దాని...సేద తీర్చి విషయాన్ని తెలుసుకున్నాడని. .. అపðడు రాముడు నోటి నుండి వచ్చిన లే.. పక్షి అన్న మాటలే తరువాత కాలం లో లేపాక్షిగా స్ధిర పడినట్లు చెప్తారు. మరోవైపు అచ్యుత రాయల ఆస్ధానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ పరమ శివ భక్తుడు కావ టంతో శివాలయాన్ని నిర్మించాలని తలచి రాజు అనుమతి తీసు కోకుండానే దీనిని ప్రారంభించి ఖజానా ధనాన్ని ఖర్చు చేస్త్తూ... మండప నిర్మాణ దశకు ఆలయం చేరు కున్న దశలో విషయం తెల్సిన అచ్యుత రాయలు ఆగ్రహించి విరూపణ్ణ ని అంధుడుని చేయమ ని ఆజ్ఞాపిం చగా... ఆ శిక్ష ఆ శివాలయంలోనే తానే అమలుపరుచుకుని గోడకు తన కళ్లని కొట్టాడని... తదుపరి జరిగిన తపð తెలుసుకున్న అచ్యుత రాయు లు తన వల్ల అక్షువులను (కళ్ల)ను కోల్పోయిన ఈ ప్రాంతానికి (అక్షి లేమి ) లేపాక్షి అని పేరు పెట్టి ఆలయ నిర్మాణం పూర్తి చేసాడని మరో కధనం ప్రచారంలో ఉంది. ఇప్పటికీ విరూపణ్ణ కనులు విసిరిన ప్రాంతంలో ఆ ఆనవాళ్లుఆలయ గోడపై దర్శనమిస్తున్నాయి.
భారీ నంది విగ్రహం..
దాదాపు 8.1 మీటర్ల పొడుగు, 4 మీటర్ల ఎత్తుతో ఏకశిలతో రూపొందిన ఈ విగ్రహం ఇప్పటికే ప్రపంచంలో అరుదైన అతి పెద్దదైన విగ్రహంగా చోటు సంపాదించుకుంది. తెలుగుజాతి వ్యవసాయంలో కీలక భూమిక పోషించే వృషభజాతిరాజసాన్ని ఒలికిస్తూ. అనేక అలంకరణలతో మహా శివునిలింగం ముందు వెూకరిల్లి ఠీవిగా మనకి ఆహ్వానం పలుకుతూ ఉం టుంది. మన తెలుగు వాకిళ్లలో సంక్రాంతి పండగకు పశువులను అలం కరిం చుకోవటం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ క్రమంలోనే ఈ నందినిశిల్పులు చెక్కినట్లు కనిపిస్తుంది.మెడలో లోహపుపట్టిలు, గంట లు కు తోడుగా గరుడ పక్షులు రెండు ఏకంగా ఏనుగుల్ని తీసుకెళ్తున్న రూపాలు, కుడి ఎడమ పక్కల్లో నృసింహ స్వామి రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. నాటి రాయల వారి రాజసానికి ఇవి దర్పంగా.. సామ్రా జ్య పటిమకు ప్రతీకగా చెప్తారు.
వీరభద్ర ఆలయం...
అడుగుడుగునా శిల్పకళకు నిలువెత్తు రూపంగా నిలచే ఈ ఆల యం పరిసరాలలో ప్రశాంతత... ప్రతి అణువు చూస్తూ... మనసు ఉప్పోంగిపోతూ ఉండేలా చేస్తుంది. లోపలి, వెలుప లి ప్రాకారాలలో..ఖాళీప్రదేశాలలో సైతం అద్భుత కళాసంపద కనిప ిస్తుంది. కూర్మాకారంలో ఉన్న రాతి శిలపై విజయనగర సామ్రాజ్య ధీరోదాత్తతని, జీవన విధానాలకు ప్రతిబింబాలుగా ఇక్కడి శిల్ప కళ కనిపిస్తుంది. నలుదిశలా నిర్మించిన కళ్యాణమండపాలు కడుచక్కగా ఉన్నా..కొన్ని అసం పూర్ణంగా నిర్మాణమైనట్లు కనిపిస్తాయి.
పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మండపంలో బ్రహ్మ,విష్ణు, దేవేంద్ర, యమ, వశిష్ట, అగ్ని, విశ్వామిత్ర తదితరులు ఈ పరిణయానికి వచ్చినట్లు మలచి న తీరు కట్టి పడేస్తుంది. అంతే కాదు పైకపðలపై రాయబడిన అనేక కుడ్య చిత్రాలు నేటికీ కనీసం రంగు కూడా వెలియ కుండా... చెక్కు చెదరకుండాఉన్నాయంటే నాటి కళాకారుల కళా నైపుణ్యా నికి ఆశ్చర్యం కలగక మానదు. అదే లేపాక్షిరంగులకున్న ప్రత్యేకత గా ఇక్కడి వారు చెప్తారు.
ఒకపðడుఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆల యం అనేక ఆక్రమణ
లకు గురికావటంతో నేడు మూడు ప్రాకారాలతో దర్శనమిస్తుంది. ఎక్కడై నా దేవాలయాన్ని దర్శించేపðడు ధ్వజ స్ధంభం నుండి నేేరుగా గర్భగుడిలో దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఆతని తీవ్ర దృష్టి పడకుండా మధ్యగా అడ్డు గోడ ఉండి ఉండ టం విశేషం. ఇక్కడి వీరభద్రుడు చిన్న చిన్న కళ్లతో అందంగా ఆకర్షణీ యంగా కనిపిస్తాడు. ఇక ఈ మండపంలో దర్శనమిచ్చే దుర్గాదేవి గాలిలో తేలుతు... ఓ మూలకు ముఖం పెట్టి ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. సీతారామలక్ష్మణులు,హనుమాన్‌స్ధాపిత శివలింగం,నవగ్రహాలు ఉన్నాయి.
వేలాడే రాతి స్ధంభం
చాలావరకు మండపాలు కూలిపోతున్నట్లుగా విదారకరదృశ్యంని ఆవిష్క రించినా... నాట్య మండపానికి తూర్పున వేలాడే రీతిగా ఈ స్ధంభ నిర్మా ణం సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. పైకపðకు అంటి పెట్టుకుని భూమికి 2 అంగుళాల ఖాళీ కనిపిస్తుందంటే..నాటి శిల్పకారులు, స్ధపతు ల శిల్పకళా వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విచిత్రాన్ని తెలుసుకు న్న అప్పటి బ్రిటీష్ పాలకులు తమ ఇంజనీర్లను పంపించగా.ఈ స్ధంభాన్ని కదిపి చూడగా... ఓవైపు మాత్రం కాస్త కిందకి జారిందని.. గైడ్లు చెప్తారు
నాగేంద్రుడు..
ఆలయ తూర్పు చివరన నాగేంద్ర విగ్రహం ఉంది. ఆరడుగుల ఎత్తులో ఉన్న ఈ నాగేంద్రుడు తన చుట్టలతో శివలింగాన్ని కావలించుకుని ..ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా ఏక శిలతో తయారైన విగ్రహమే... ఈ పడగ వెనుక ఉన్న గోడపై చిన్న గోళీలంత సైజులో ఏర్పడ్డ రం ధ్రాలు... వాటిలో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఇవి విరూపఫ్ణుని కళ్లుగా చెప్తారు.
శిల్ప కళ
నాటి ప్రజల జీవ నవిధి విధానాలను, కళాభిరుచులను ఇక్కడి కళా ఖండాలు అలనాటి అపురూప దృశ్యాలను సాక్షా త్కరింపచేస్తాయి.పాలకుల నిర్ల క్ష్యం వల్ల అక్కడక్కడా కొంత భాగం కూలిపోయినా..ప్రపంచానికి లేపాక్షి నంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా సరైన ఆలనా పాలనా లేకపోవటం ఉన్నదాన్ని రక్షించకపోవటంతో చెత్తాచెదారం పేరుకు పోయి నేడు ఈ ప్రాంతమంతా దుర్గంధంలో కూరుకుపోతూ ఉండటం.. చాలా మేర ఆక్రమణల బారిన పడటం ఆందోళనకరం.పాలకులెపðడు పట్టించు కుంటారా అనిదీనంగా చూస్తున్నట్లు ఉంటుంది ఈ ఆలయ పరిస్ధితి,
లేపాక్షి దుస్తులు :
వస్త్ర పరిశ్రమలో లేపాక్షి వస్త్రాలకు ప్రత్యేక స్ధానం ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి నేత పరిశ్రమ లేదని.. చుట్టుపక్కల ఉన్న నేత పనివారు విరూ పాక్షుని ఆలయం లోని వివిధ విగ్రహాలు, కుండ్య చిత్రాలను తాము నేసే వస్త్రాల పై వేసి లేపాక్షి వస్త్రాలుగా చలామణి చేస్తారని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశమే...
నంది అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలలో ఉత్తమంగా నిలచిన చిత్రాలకు.. నటీ నటులకు.. సాంకేతిక నిపుణులకు, టివి నటీనటులకు నంది అవార్డు లను ఏటా అందిస్తూ వస్తోంది. ఇందుకు అందించే ప్రతిమలను లేపాక్షి నంది నే ప్రాతిపదికగా తీసుకుని రూపొందించడం విశేషం.
తెలుగుజాతి వారసత్వ సంపదగా భాసిల్లుతున్న లేపాక్షి కళా కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీనిని మరింత ముందు కు తీసుకు పోయేందుకు హెరిటేజ్ లేపాక్షి పేరుతో ప్రత్యేక సంస్ధని ఏర్పాటు చేసారు. యునిస్కో గుర్తింపు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అద్భుత కళా సంపదను రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్య త కూడా అంతే ఉంది.
ఎలా వెళ్లాలి...
బెంగుళూరు.హైదదాబాద్ హైవేకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుండి ఇక్కడి కి చేరుకునేందుకు ప్రతి గంటకు ఒక బస్సుని నడుపుతున్న ఆర్ట్టీసి. ఇవి కాక శివరాత్రి తదితర సందర్భాలలో మరిన్ని బస్సులు నడుపుతుంది. అయితే ఇక్కడకి వచ్చే యాత్రీకుల సౌక ర్యార్ధం కేవలం ఒక్క గెస్టుహౌజ్‌ని నిర్మించడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రుళ్లు బస చేయటం తలకు మించిన భారంమై చిన్నపాటి హౌటళ్లే యాత్రీకులకు ఆధారమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని గదుల నిర్మాణం జరిగితే సౌకర్యవం తంగా ఉంటుందని యాత్రీ కులు కోరుతున్నారు.