విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాడో' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు
చిత్రాల షూటింగ్ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా
సమయం పడుతుంది. 'బాడీగార్డ్' తరువాత వెంకటేష్ చిత్రమేదీ ప్రేక్షకుల
ముందుకు రాలేదు. రెండు సంవత్సరాల క్రితం మాంచి ఊపుమీదున్న ఆయన ఈ మధ్య
నెమ్మదించారు. తన సహచర నటులు బాలకృష్ణ, నాగార్జున చాలా స్పీడ్ మీదున్నారు.
వారు ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తూ మూడు, నాలుగు నెలలకు ఒక్కో చిత్రం
పూర్తిచేస్తూ మళ్ళీ కొత్తవి కమిట్ అవుతున్నారు. వారి సమకాలికుడైన
వెంకటేష్ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నారని ఆయన సన్నిహితులే ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. హాస్యప్రధానమైన కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా
పేరున్న వెంకటేష్ కొంతవేగాన్ని పెంచితే బావుంటుందని పరిశ్రమ వర్గాలు సైతం
అభిప్రాయపడుతున్నాయి.