టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తున్న అజెండాను మోయటానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడుతున్నారని, వారికి స్వంత అజెండాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవా చేశారు.
సనివారం అయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31 పూర్తయ్యాక రాష్ట్రం ఏమైపోతుందోననే భయాందోళన
కన్నా... తమ రాజకీయాలు ఏమైపోతనో అనే భయం పట్టుకోందని...శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక ఏదైనా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ ప్రక్రియ ద్వారానే జరగాలని, ఈ పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టటం మంచిది కాదని, దీని వల్ల తెలంగాణకే నష్టం జరుగుతుందని చెప్పారు.