ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం కొందరు రాజకీయ నాయకుల కల్పనేనని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు...
600 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 6 లక్షల మంది హాజరవుతున్న ఈ రోజుల్లో కొత్త ఉద్యోగాలు ఎలా కల్పించగలరని రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా చిన్నదైతే అభివృద్ధి కుంటు పడుతుందని, చిన్న రాష్ట్రాల కన్నా పెద్ద రాష్ట్రాల వల్లనే లాభాలు ఎక్కువ అని ఆయన అన్నారు.