డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించడానికే రూ.15 కోట్లు ఇవ్వాలని ఓ మంత్రి పరోక్షంగా అడిగారని సంచలన ఆరోపణలు చేసారు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ..
'21వ శతాబ్దంలో భారత్: అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై జరిగిన చర్చలో టాటా మాట్లాడుతూ "భారత్‌లో దేశీ విమానయాన సర్వీసును ప్రారంభించాలని భావించా. ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాను. వైమానిక రంగంలోకి ప్రవేశించాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని, 1995, 1997, 2001 సంవత్సరాల్లో మూడుసార్లు సంబంధిత ఫైల్‌ను కదిపానని.. మూడు ప్రభుత్వాల హయాంలో ముగ్గురు ప్రధాన మంత్రులను కలిశాం. కానీ, మంత్రి రూ.15 కోట్లు ఇవ్వాలని మా ప్రయత్నాలన్నిటినీ అడ్డుకున్నారు. అందుకే మేం వైమానిక రంగంలోకి అడుగు పెట్టలేకపోయాం. రూ.15 కోట్లు లంచం ఇచ్చి దేశీ వైమానిక రంగాన్ని ప్రారంభించానని అనుకుంటే నేను నిద్రపోలేను'' అని ఆయన వివరించారు.
అయితే, ఆ మంత్రి ఎవరన్న విషయాన్ని మాత్రం రతన్ టాటా బయటపెట్టలేదు.