బంతితో మాయాజాలం చేసే భార త స్పిన్నర్ హర్భజన్ సింగ్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. టెస్ట్‌ల్లో తొలి సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ ఘనత సాధించాడు. 170 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ భజ్జీ బ్యాట్ ఝుళిపించి 69 పరుగులు చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడిన టీమిండియాను లక్ష్మణ్ (94), హర్భజన్(110) ఆదుకున్నారు. భజ్జీకి తోడుగా ఓజా(7) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255/8 స్కోరుతో ఆటకొనసాగిస్తోంది. ఇప్పటివరకు కివీస్‌పై భారత్‌కు 283 పరుగుల ఆధిక్యం లభించింది.