ఈనెల 17 నుంచి తెలంగాణ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వంమధ్యాహ్నం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, దామోదర రాజనర్శింహల ఆధ్వర్యంలో సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చలు జరిపారు.
తెలంగాణ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోలేదని, కేంద్ర సర్కారు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని... సహాయ నిరాకరణ ఉద్యమానికి దూరంగా ఉండాలని మంత్రులు చేసిన సూచనని ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించలేదు. ఇది తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరుగుతుందని,తప్పనిసరిగా పాల్గొనవలసిందేనని స్పష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయ నిరాకరణ తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.