పదవి కోసమే వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని, పదవి కోసమే చిరంజీవి కాంగ్రెసులోకి వచ్చారని..తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆయన చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ జగన్ 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారని, ఆ లెక్కన చూసుకొన్నా జగన్ ఆదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, అయితే ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాదన్న విషయం తెలిసినా... ఆయన అక్రమ సంపాదనను క్రమబద్దీకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీన వైకరి అవలంబిస్తున్నారని..ఇది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు.