డెడ్‌లైన్లు, రాజీనామాలతో కెసిఆర్ సాధించిందేమీ లేదని...ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కి మరోమారు భంగపాటు పాటు తప్పదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు
శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపై నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలోనే..విఅని విషయం తెలిసినా అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడటం ఏంటని నిలదీసారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెరాస ఉండదని జోస్యం చెప్పారు.
మరోవైపు జగన్ వ్యవహారంపై స్పందిస్తూ... ప్రజలు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటేనని..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సభలకు కూడా పెద్ద యెత్తున ప్రజలు వచ్చారని, కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలేదని...జగన్ పరిస్థితి కూడా అంతేనని..వ్యాఖ్యానించారు విహెచ్.