చిరంజీవి కాంగ్రెసులో చేరడాన్ని తాము స్వాగతిస్తున్నామని... అయితే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని..ఆరోపణలు చేయడంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా చిరంజీవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాక వల్ల కాంగ్రెసుకు తెలంగాణలో ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, సీమాంధ్రలో కూడా ప్రయోజనం అంతంత మాత్రమేనని..కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.