జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఆయనపై అభాండాలు వేస్తున్నారని, వాటికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎవరెన్ని కుయుక్తులు పన్నినా జగన్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ అవసాన దశలో ఉన్న కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీకి జీవం పోస్తే ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ బయటకు నెట్టివేసిందని ఆరోపించారు.
కేసిీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతానంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని , ఒక పత్రిక యాజమాని, మరో ఛానల్ అధినేత, ఇతర పార్టీల వారు ఏకమై జగన్‌పై లేనిపోని అపవాదులు వేస్తూ ద్రుష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.