వైఎస్ సమాధి వద్ద తమ పార్టీని ప్రకటిం చబోతున్నట్టు కడప మాజీ ఎంపి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. సోమ వారం ఆయన బద్వేల్ లో మీడియాలో మాట్లాడుతూ... తన తండ్రి వైఎస్ జన సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ప్రతి పధకాన్ని తుంగలో తొక్కుతూ నిధుల పేరిట మురగేసిందని.. దీంతో విద్యార్ధుల నుండి లక్షలాది ప్రజలు తగిన ప్రభుత్వ సాయం అందక బిక్కు బిక్కుమని కాలం వెల్లదీయాల్సిన పరిస్ధితి నెలకొందని విమర్శించారు.
ఫీజు రీఎంబర్‌స మెంట్‌కింద చెల్లించాలిన బకాయిలు చెల్లించడానికి కూడా మనస్కరించకుండా విద్యార్ధులని ఆత్మహత్యలకి పురిగొల్పుతున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసినా తప్పులేదని వాఖ్వానించారు.
మార్చి నెలలో తమ పార్టీ వైఎస్ పాదాల చెంత ఆవిష్కరింపబడబోతోం దని... పేదల సంక్షేమం కోరే వైఎస్ ఆశయాలు ముందుకు తీసు కెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరు తనతో కలిస రావాలని సూచించారు.
మళ్లీ వైఎస్ స్వర్ణయుగ పాలనని మనమే తెచ్చుకుందాం.. ముఫై ఏళ్లు ఈ రాష్ట్రాన్ని మనమే పాలించుకుని సుసంపన్నం చేసుకుందాం.. అంతా తనతో చేతలు కలపాల్సిందిగా ప్రజల్ని కోరారు జగన్,.