ప్రభుత్వంపై తెరాస అధినేత కేసీఆర్‌తో సహా ఎవరు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టినా ఎదుర్కొనటానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు పిసిసి ఛీఫ్ డి.శ్రీనివాస్.
సోమవారం ఆయన హైదరాబాద్ - గాంధీ భవన్‌లో మీడియాలో మాట్లా డుతూ.. బలంగా ఉన్న ప్రభుతాన్ని కొందరు అస్ధిర పరచాలన్న యుక్తులు చేస్తు న్నారని ఆరోపించారు. వారి ప్రయత్నాలు ఫలించవన్న విషయం వారికీ తెలిసి నా..కేవలం అయోమయం సృష్టించాలనే ఇలా ప్రకటనలు చేస్తున్నారనిపిస్తోం దన్నారు. అవిశ్వాసం నిజంగా ప్రవేశ పెడితే.. జగన్‌కి చెందిన శాసనసభ్యులతో సహా మిత పక్షాలు తమకు మద్దతు ప్రకటిస్తారని.. ధీమా వ్యక్తం చేసారు డి.ఎస్.
మరోవైపు తెలంగాణా ఉద్యోగ జెఎసీ సహాయ నిరాకరణలో పాల్గొనటం వల్ల సామాన్య ప్రజలు సైతం ఇక్కట్లపాలవుతారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే ఉదోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమా ర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెపారాయన.