రాష్ట్ర సర్కారుని కాపాడేందుకే తాను ఆపదాంధవుడి అవతారం ఎత్తానని... ఆ క్రమంలోనే ప్రజాభిష్టం మేరకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీ నం చేయా లని నిర్ణయించానని తాజా కాంగ్రెస్ నేత చిరంజీవి చెప్పారు.
సోమవారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ... తన అభిమానులకు, తనకు అంతరాన్ని పెంచేందుకు కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు పనికట్టుకుని తప్పుడు కధనాలు ప్రసారం చేస్తున్నాయని.. వీటిని ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు.
కొందరు తమకున్న ధనం బలంతో విర్రవీగుతూ కొత్తగా పార్టీ పెట్టేందుకు సిద్దమై పోతున్నారని.. వారికి తన ప్రజారాజ్యంకి వచ్చినన్ని ఓట్టు కానీ, సీట్లు కానీ తెచ్చుకో గల సత్తా ఉందా? అని అన్యోపదేశంగా జగన్‌ని ప్రశ్నించారు.
ప్రజారాజ్యం పార్టీలో తన కార్యకర్తలు, అభిమానుల అండతో ఎదిగిన నాయ కులు ఇప్పుడు తననే విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తునని అన్నారు చిరంజీవి.