14, ఫిబ్రవరి 2011, సోమవారం

కాంగ్రెస్ భూస్థాపితమవడం ఖాయం : గద్దర్

ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే వరకు తెలంగాణవాదులంతా సంఘటితంగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ అ ధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో 24 రోజులుగా సాగిస్తున్న రిలే నిరాహార దీక్ష దీక్షలో కూర్చున్న పద్మశాలీ సంఘం నాయకులకు సంఘీభావం తెలిపారు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా మౌనం వీడి, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పె ట్టకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆటా పాటతో అలరించారు.