14, ఫిబ్రవరి 2011, సోమవారం

జగన్‌కి తెలంగాణా జేఏసీ మద్దతు

హైదరాబాద్‌ : ఈ నెల 18వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన దీక్షకు తెలంగాణ ప్రజసంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది.

సోమవారం జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ చేపట్టనున్న దీక్షకు విద్యార్థులు వేలాదిగా తరలి రావాలని.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా ఫీజులు చెల్లించరా.. సర్కార్ నాన్చుడు ధోరణి అవలంభిస్తే 24న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని...తెలంగాణా వాదానికి, విద్యార్ధుల భవిష్యత్‌కి ముడి పెట్టి మాట్లాడటం తగదని... భవిష్యత్‌ అంతా విదార్ధులు, యువతదేనని.. ఓ వైపు చెపుతూనే.. ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యదోరణి ప్రదర్శిసూందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల్ని చెల్లించేందుకు తగురీతిన స్పందించట ం లేదు సరికదా.. ఇంజనీరింగ్‌ కళాశాలలు మూసేసామని చెప్పడంతో విద్యారులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మిన్నకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజసంఘాల జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం మండిపడ్డారు.