పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండుతో అ సెంబ్లీ బడ్జెట్ సమావేశాల ను బహిష్కరిస్తామని ఎమ్మె ల్యే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకుగాను పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఏకమై సమావేశాలను అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. కేం ద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజే పీ సహకారంతో టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తూ తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించాలన్నారు.
కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలతో టీఆర్ఎస్ బలోపేతానికి కృ షి చేయడం మానుకొని, అందరితో క లిసి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ముందుకు రావాలన్నారు. సోనియా, జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. అవసరమనుకున్నప్పుడు 91 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ముందుకెళ్తుందని,. కేసీఆర్ 11మంది ఎమ్మెల్యేతో అ విశ్వాసం పెడితే, అందుకు టీడీపీ మద్దతు పలికే ప్రసక్తే లేదన్నారు.