30, అక్టోబర్ 2010, శనివారం

గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకా?

రోజు రోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన సాధ్యాసాధ్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల సంఖ్య విపరీతంగా పెరగడం, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు సైతం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి నియంత్రించడం మోటార్ వెహికల్ అధికారులకు సాధ్యపడడంలేదు. అలాగే మోటార్ సైకిళ్ల వినియోగం కూడా పట్టణాలకు దీటుగా పల్లెలో పెరిగిపోవడంతో ప్రమాదాలకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధ్యయనానికి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికారుల కమిటీ ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ఈ నియంత్రణ అధికారాలను గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని వుంది. దీనిపై అన్నిశాఖల అధికారుల తీరుతెన్నులపై క్షేత్రస్థాయి నుంచి చర్చలు జరుగుతున్నా.... పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు చేయడానికే కార్యదర్శులు, సిబ్బందిలేక సతమతమవుతున్న తరుణంలో ఈ వాహన నియంత్రణ చట్టం భారం ఏమేరకు ఫలిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో సైకిళ్లకు లైసెన్స్ విధానం అమల్లో ఉండేది. దీంతో పంచాయతీ ఉద్యోగులు రోడ్లపై కాపుకాసి (వెహి కల్ ఇన్‌స్పెక్టర్ల మాదిరిగా) రూ.0.50 పైసలు, రూపాయి విలువగల అల్యూ మినియం లైసెన్సు బిళ్లలు ఏర్పాటు చేసేవారు. లైసెన్సులు లేని సైకిళ్లపై కేసులు నమోదు చేసేవారు. అనంత రం ఈ విధానం రద్దయింది. అయితే ఆవిధంగా ఇప్పుడు ఆ స్థాయిలో వాహనాల నియంత్రణకు గ్రామ కార్యదర్శులు నడుం బిగిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంద ని అధికారులు భావిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, స్థానిక రాజకీయ జోక్యం అధికమవడం ఇది సాధ్యా సాధ్యాలపై చర్చ జరుగుతోంది